Former MP Lagadapati Rajagopal and BJP leader Purandeswari shock to Andhra Pradesh chief Minister Nara Chandrababu Naidu on tdp mlas working progress and budjet allotments to ap state. <br /> ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఓ షాకింగ్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. <br />లగడపాటి రాజగోపాల్ ఇటీవల రెండుమూడుసార్లు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం కూడా తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి.. చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు.
